దాబాల్లో విచ్చలవిడిగా మద్యం సిట్టింగ్
అనుమతి లేకుండా మద్యం తాగేందుకు అవకాశం కల్పన
గాంధారి ప్రకాష్ దాబా యజమాని అన్వేష్‌పై కేసు నమోదు
కఠిన చర్యలు తప్పవని ఎస్సై ఆంజనేయులు హెచ్చరిక
దాబాలు, హోటళ్లలో సిట్టింగ్ ఇచ్చినా చట్టపరమైన చర్యలు
గాంధారి, ఆగస్టు 24 (ప్రశ్న ఆయుధం):
మద్యం సిట్టింగ్‌లపై పోలీసులు గట్టిగా దాడి చేశారు. గాంధారి మండల కేంద్రంలోని ప్రకాశ్ దాబాలో ఎలాంటి అనుమతి లేకుండా మద్యం తాగేందుకు అవకాశం కల్పించిన యజమాని అన్వేష్‌పై కేసు నమోదు చేశారు.స్థానిక ఎస్సై ఆంజనేయులు వివరాలు తెలియజేస్తూ… “దాబా, హోటళ్లలో ఎవరైనా పర్మిషన్ లేకుండా మద్యం సిట్టింగ్ ఇచ్చినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ విధమైన అక్రమ కార్యకలాపాలను ఏ మాత్రం సహించబోము” అని హెచ్చరించారు.గాంధారి మండల పరిధిలోని దాబాల్లో విచ్చలవిడిగా సిట్టింగ్‌లు నిర్వహించడంపై పోలీసుల కఠిన చర్యలతో యజమానుల్లో కలకలం రేగింది.