చిల్లకల్లుకు కారులో తరలిస్తున్న ఆరు కేసుల తెలంగాణ మద్యం సీజ్..
తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ నుండి జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామమునకు మారుతి సుజుకి సియాజ్ కారులో తరలిస్తున్న ఆరు కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకోవటం జరిగింది. చిల్లకల్లు గ్రామానికి చెందిన మల్లెల అనిల్ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి మద్యం ను విక్రయించుటకు మరియు ఫోన్ పే ద్వారా డబ్బులను పొందటానికి ఉపయోగిస్తున్నటువంటి ఒప్పో స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకోవటం జరిగింది. ఈ కేసులో ఇతని వెనకాల ఇతర నిందితులు ఎవరైనా ఉన్నారా అనేది తదుపరి దర్యాప్తులో తెలుస్తుందని జగ్గయ్యపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఎస్. మణికంఠ రెడ్డి తెలిపారు