Site icon PRASHNA AYUDHAM

నిజామాబాద్‌లో న్యూసెన్స్ చేసిన ఆరుగురికి జైలు శిక్ష

Screenshot 2025 10 13 16 02 30 73 7352322957d4404136654ef4adb64504

నిజామాబాద్, అక్టోబర్ 13 (ప్రశ్న ఆయుధం):

నగరంలోని బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో శనివారం (11-10-2025) రాత్రి 8 గంటల సమయంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించిన ఆరో మహిళలపై పోలీసులు చర్యలు చేపట్టారు. మగవారిని ఆకర్షించేలా ప్రవర్తిస్తూ, ప్రజల్లో అసౌకర్యం కలిగించడంతో 68 సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయగా, వారిని అరెస్టు చేశారు.

ఈ కేసును విచారించిన స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి, ఆరోపణలు నిఖార్సైనవిగా పరిగణించి…

చామంతికి ఒక రోజు,మిగిలిన లత, కే. లక్ష్మీ, ఒడ్డే లక్ష్మీ, ఎల్లమ్మ, డొక్కా చంద్రకళలకు రెండు రోజుల జైలు శిక్షలు విధించారు.

కోర్టు ఉత్తర్వుల మేరకు వారిని జైలుకు తరలించామని 1టౌన్ ఎస్ఎచ్‌ఓ బి. రఘుపతి తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్ఎచ్‌ఓ బి. రఘుపతి హెచ్చరిస్తూ మాట్లాడుతూ,
“టౌన్ 1 పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరు న్యూసెన్స్ సృష్టించినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు.

Exit mobile version