అనంతపల్లి బంధం చెరువులో ఆరు క్వింటాళ్ల చేపలు మృతి
బోయినిపల్లి( , జనవరి,17)
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం అనంతపల్లి గ్రామంలోని బంధం చెరువులో ఆరు క్వింటాల్ల చేపలు మృతి చెందాయి. స్థానికుల చెప్పిన ప్రకారం.. శుక్రవారం ఉదయం బంధం చెరువులో చేపలు పడుదామని మత్స్యకారులు వెళ్లేసరికి దాదాపు 6 క్వింటాళ్ల చేపలు చనిపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందారు.నీళ్లలో ఏదైనా కలపడంతో చనిపోయినట్టు అనుమానం వ్యక్తం చేశారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చేపలను పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని మత్స్యకారులు కోరారు.