సాంకేతికత ద్వారానే నైపుణ్యాల అభివృద్ధి

సంగారెడ్డి, సెప్టెంబరు 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలలో ఎన్ఎస్ఎస్, జీవశాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎల్ టెక్నాలజీ వారి సహకారంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్షిప్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రత్న ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక కాలంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేకుండా ఏ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించలేమని వ్యక్తి సమర్థతను సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలు పెంపొందిస్తాయని అన్నారు. ప్రస్తుత ఆధునిక కాలంలో విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలంటే ఆయా రంగాలకు సంబంధించిన నైపుణ్యాలను పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అనంతరం ఆర్ఎస్ఎల్ టెక్నాలజీ అధినేత రాజ్ కుమార్ మాట్లాడుతూ తమ సంస్థ విద్యార్థులకు స్టీఫండిస్తూ ఇంటర్షిప్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నదని, ఈ ఇంటర్షిప్ తర్వాత ఉపాధి అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీశ్వర్, ఆర్ఎస్ఎల్ టెక్నాలజీ అధినేత రాజ్ కుమార్, ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ సదయ కుమార్, డాక్టర్ సుమతీ దేవి, ఐ క్యు ఎ సి కోఆర్డినేటర్ డాక్టర్ మల్లిక, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now