“నా స్వార్థం కోసం కలిస్తే చెప్పుతో కొట్టండి”..!!
‘అది నిరూపిస్తే… రాజీనామా చేస్తా’ — పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు
బాన్సువాడ అభివృద్ధి కోసం మాత్రమే సీఎం రేవంత్‌ను కలిశానని స్పష్టం
వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేయడం లేదని స్పష్టత
ప్రజా సేవే లక్ష్యమని పోచారం హామీ
“ప్రజలకు హానీ కలిగించే పని జీవితంలో చేయను” అన్నారు
“రేవంత్‌కి ఏదైనా అడిగానని నిరూపిస్తే వెంటనే రాజీనామా” సవాల్
బాన్సువాడ, అక్టోబర్ 23 (ప్రశ్న ఆయుధం):
బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. బాన్సువాడ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు. “నా స్వార్థం కోసం కలిస్తే చెప్పుతో కొట్టండి” అని ప్రజలకు సవాల్ విసిరారు.
ప్రజా సేవే తన రాజకీయ జీవితం లక్ష్యమని, ప్రజలకు హానీ కలిగించే పనిని ఎన్నడూ చేయనని స్పష్టంగా తెలిపారు. “ఇప్పటివరకు నేను వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డిని ఏదైనా అడిగానని ఎవరైనా నిరూపిస్తే, తక్షణమే నా పదవికి రాజీనామా చేస్తాను” అని పోచారం ప్రకటించారు.
పోచారం వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.