స్మిత సబర్వాలె పెద్ద దివ్యాంగురాలు…

దివ్యాంగులు సాధించిన విజయాలను కళ్ళుండి చూడలేని స్మితా సబర్వాలే పెద్ద దివ్యాంగురాలు
సతీష్ గుండపునేని
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్సి 23
వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం కేసు నమోదు చేయాలి

కొత్తగూడెం దివ్యాంగులు సాధించిన విజయాలు కళ్ళతో చూడలేని స్మిత సబర్వాల్ ఐఏఎస్ తీరును నిరసిస్తూ మంగళవారం స్థానిక పోస్ట్ ఆఫీస్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా కళ్లకు గంతలు కట్టుకొని తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల(టి వి పి ఎస్) సభ్యులు మంగళవారం తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా టీవీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, వీజేఏసీ చైర్మన్ సతీష్ గుండపునేని మాట్లాడుతూ, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి
వికలాంగులను కించపరిచే విదంగా ట్విట్టర్లో పోస్ట్ పెట్టిన ఐఏఎస్ స్మిత సభర్వాల్ పై చర్యలు తీసుకోవాలని, వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ సర్వీస్లో వికలాంగులకు ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించడం ఆమె అవివేకనికి నిదర్శనం.కేంద్ర ప్రభుత్వ సర్వీస్ ఉద్యోగ నియామకాలో వికలాంగుల రిజర్వేషన్ అమలు చేయాలని కోర్ట్ తీర్పులు ఉన్నాయనే విషయం తెలియకుండా ఐఏఎస్ ఎలా అయ్యారు. ప్రతిభ ఎవ్వరి సొత్తు కాదు.వికలాంగుల మనోభావాలు దెబ్బతినెలా ప్రవర్తించిన స్మిత సభర్వాల్ వెంటనే వికలాంగులకు క్షమాపణ చెప్పాలి. దివ్యాంగులుగా ఉన్నప్పటికీ అనేకమంది తమ ప్రతిభతో ఐఏఎస్ ఆఫీసర్లుగా, సుప్రీంకోర్ట, జడ్జిలుగా గొప్ప శాస్త్రవేత్తలుగా సేవలందించిన వారి విజయాలు చూడలేని స్మితా సబర్వాల పెద్ద వికలాంగురాలని అందుకే వారి ప్రతిభ ఆమె గుర్తించలేని అహంకార పూరితంగా ట్విట్టర్ లో పోస్ట్ కు పెద్ద ఎత్తున వ్యతిరేకతవస్తున్న ఇంత మటుకు దివ్యంగులకు క్షమాపణ చెప్పకపోవడం ఆమె అహంకారానికి అద్దం పడుతుందని. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆమె పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆమె ప్రకటన వికలాంగుల హక్కుల చట్టం, 2016 యొక్క మార్గదర్శక సూత్రాలైన సమానత్వం మరియు వివక్ష కు వ్యతిరేకంగా ఉందన్నారు.
వికలాంగులను కించపరిచే విదంగా పోస్ట్ చేసిన ఐఏఎస్ స్మిత సభర్వాల్ పై చర్య తీసుకోవాలన్నారు. లేని పక్షాన ఆందోళన మరింత ఉధృతం చేస్తామని దివ్యంగులను కించపరిచిన చులకనగా చూసిన వారు ఎంత పెద్ద వారైనా క్షమించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ మక్కట్, మాదిగ జేఏసీ అధ్యక్షులు జోగారావు, బిజెపి జిల్లా కన్వీనర్ కాటి నాగేశ్వరరావు సంఘ ఉపాధ్యక్షులు ఖాదర్ బాబా ప్రధాన కార్యదర్శి మేడి ప్రవీణ్ మహిళా సభ్యురాలు శైలజ, కళా బాబు రెడ్డి, సురేష్, సాయిబాబా, శ్రీను,గట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now