స్మిత సబర్వాల్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

వికలాంగుల కమ్యూనిటీని కించపరిచిన ఐఏఎస్ స్మిత సబర్వాల్ వారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి, రత్నకుమారి
ప్రశ్న ఆయన మూవీస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్సి జూలై 23

అంగవైకల్యం వారి శరీరానికే గాని మనసుకు కాదు, అన్ని అవయవాలు సరిగా ఉన్న మనకంటే వారే శక్తివంతులు రెండు కాళ్లు లేకపోయినా, రెండు చేతులు లేకపోయినా, వివిధ రంగాలలో, ఐఏఎస్ ఆఫీసర్లుగా పైలెట్లుగా రాణిస్తున్నారు, స్మిత సబర్వాల్ మీరు ఏ ఉద్దేశంతో వారిని అన్నారో కానీ అంగవైకల్యంతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఉద్యోగాలు శక్తివంతంగా చేసుకోగలుగుతున్నారని మహిళా సమాఖ్య నాయకురాలు రత్నకుమారి మంగళవారం కొత్తగూడెం నుండి వెల్లడించారు. అంగవైకల్యాలను బట్టి ప్రభుత్వం వారికి వారి ఉద్యోగాలు కేటాయిస్తున్నారు, కానిస్టేబుల్ గా ఎస్సై సీఐలుగా పరుగులు పెట్టే ఉద్యోగం కాదు కదా ఐఏఎస్ ఉద్యోగలు , మీరు ఏసి రూముల్లో కూర్చుని ఎలా చేస్తున్నారో వారు కూడా అలాగే చేస్తారు, సీనియర్ ఆఫీసర్ గా వారి బాధలు అర్థం చేసుకొని వికలాంగుల కోట పెంచడానికి సహకరించవలసిన మీరే వారిని బాధపట్టే ట్విట్ట్లు పెట్టడం సరికాదు, ఎవరికీ ఏ పోస్ట్ లు ఇవ్వాలో రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు,మీకు సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకొని వారిని కించపరిచే విధంగా వారి మనోభావాలు దెబ్బతీసినందుకు వారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని భద్రాద్రి కొత్తగూడెం సిపిఐ ఎంఎఫ్ఐ డబ్ల్యు మహిళా సమైక్య తీవ్రంగా ఖండిస్తున్నారు.

Join WhatsApp

Join Now