Sample Headlines (Telugu)
-
“ఎస్సెమ్మెస్ చార్జీల పెరుగుదలపై ఖాతాదారుల ఆవేదన”
-
“బ్యాంకు ఖాతా నిర్వహణ ఖర్చులు సామాన్యులకు భారమవుతున్నాయి”
-
“ఎటిఎం కార్డుల వార్షిక చార్జీలపై నియంత్రణ అవసరం”
-
“ఖాతాదారులకి రిజర్వ్ బ్యాంకు నుండి సమాధానం ఎప్పుడూ?”
-
“బ్యాంకు చార్జీలను తగ్గించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి”
ఈ మధ్య అన్ని బ్యాంకుల వారు ఎస్.ఎం.ఎస్ చార్జీల మోత మోగించడం ఎక్కువైంది. అలాగే ఎ.టి.ఎం. కార్డుల పేరుతో వార్షిక చార్జీల మోత మరీ ఎక్కువగా వున్నది. దీంతో తమ బ్యాంకు ఖాతా లోని డబ్బు మాటిమాటికీ ఎందుకు, ఎంత కోత పడుతున్నదో తెలియని అగమ్యగోచర పరిస్థితుల్లో ప్రస్తుతం ఖాతాదారులు కొట్టు మిట్టాడుతున్నారు. ప్రైవేటు బ్యాంకుల జిల్లా సహకార బ్యాంకుల్లో కూడా ఇదే పరిస్థితి నడుస్తున్నది. వారు అనుసరిస్తున్న కొన్ని అర్థం పర్థం లేని అస్తవ్యస్త విధానాలు ఖాతాదారుల పాలిట పెను శాపంగా పరిణమిస్తున్నాయి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం వెంటనే ‘రిజర్వ్ బ్యాంకు’కి దిశానిర్దేశం చేసి చార్జీల మోతను కొంత మేరకైనా కట్టడి చేయాలి. అప్పుడే సామాన్యుడికి కొంత ఊరట కలుగుతుంది