ఎల్లారెడ్డి, సెప్టెంబర్19, (ప్రశ్న ఆయుధం):
స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ (SNSPA) కార్యక్రమం లో భాగంగా ఈరోజు మత్తమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ వెంకటసుబ్బయ్య (జనరల్ మెడిసిన్) ఆధ్వర్యంలో జరిగిన ఈ క్యాంపులో 71 మంది మహిళలకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించబడినాయి.
ఈ శిబిరంలో ప్రధానంగా జనరల్ కేసులనే పరిశీలించగా, 15 మంది బీపీ రోగులు, 10 మంది షుగర్ రోగులను గుర్తించారు. అదేవిధంగా ముగ్గురికి క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపి, 9 మందికి రక్త నమూనాలు సేకరించి టీ-హబ్‌కి నిర్ధారణ కోసం పంపించారు.
క్యాంపులో పీహెచ్సీ వైద్యుడు డాక్టర్ శరత్ కుమార్, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జనార్ధన్, సూపర్వైజర్ రాణి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు మరియు పీహెచ్సీ సిబ్బంది పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు.