సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం.

*సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం..*

*ముదిరాజులకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్..*

*బీసీ గణనతో పెరగనున్న రాజకీయ అవకాశాలు..*

*ఐక్యతతో ముందుకు వెళితేనే గుర్తింపు : నీలం మధు ముదిరాజ్..*

*శంకర్ పల్లి లో ముదిరాజ్ సంక్షేమ భవనం ప్రారంభం..*

*పండగ సాయన్న, స్వర్గీయ కిచ్చన్నపల్లి రవీందర్ ముదిరాజ్ విగ్రహాల ఆవిష్కరణ..*

*హాజరైన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి..*

సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.

గురువారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపాలిటీలో ముదిరాజ్ సంక్షేమ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులకు పెద్దపీట వేసి ముదిరాజ్ జాతి సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. గత ఎన్నికల్లో కొన్ని పార్టీలు ముదిరాజులను విస్మరిస్తే కాంగ్రెస్ పార్టీ ముదిరాజులకు టికెట్లు ఇచ్చి గుర్తింపునిచ్చిందని కొనియాడారు. అసెంబ్లీలో ముదిరాజులకు అవకాశం కల్పించడమే కాకుండా స్థానిక సంస్థలలో మన ప్రాతినిధ్యం పెరిగేందుకు బీసీ కులగణనను ప్రారంభించారని గుర్తు చేశారు. బీసీ కులగనన పూర్తయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన ముదిరాజుల బీసీ ల ప్రాతినిధ్యం పెరిగి రాజకీయంగా అవకాశాలు పెరుగుతాయి అన్నారు. గత ఎన్నికల ముందు ముదిరాజులకు రాజకీయ గుర్తింపు కోసం ఐక్యంగా పోరాడిన మన జాతి బిడ్డలంతా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఐకమత్యంతో ముందుకు కదిలితే మన హక్కులను సాధించుకోవచ్చని స్పష్టం చేశారు. మన గుర్తింపు సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మనమంతా మద్దతుగా నిలబడి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పులిమామిడి రాజు, శంకర్పల్లి మండలాధ్యక్షుడు తలారి మైసయ్య, అందే బాబయ్య, డాక్టర్ మద్దెల సంతోష్, రావులపల్లి నారాయణ, శ్రీకాంత్,నరేష్,జంగయ్య, రాములు, మన్నే వెంకటేశ్, లింగం, స్థానిక ప్రజాప్రతినిధులు, ముదిరాజ్ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment