సర్వేలో  కుటుంబ వివరాలను నమోదు చేయించుకున్న సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ రాథోడ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు గ్రామం నందు ఏన్యూమరేటర్స్ నిర్వహిస్తున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేలో తమ కుటుంబ మరియు ఆర్థిక స్థిరాస్తి వివరాలను నమోదు చేయించుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ రాథోడ్. ఈ సందర్భంగా నవీన్ రాథోడ్ మాట్లాడుతూ కుల గణన సకల జనులకు ఆదరణ అని తెలియజేస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల వారికి న్యాయం చేయడమే కుల గణన ప్రధాన ఉద్దేశమని,అన్ని పార్టీలు మోసం చేసిన, జననేత రాహుల్ గాంధీ  ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసి తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపడుతుందని,కులగణన సామాజిక వ్యవస్థలో ప్రస్తుతం ఉన్న అంతరాయాలను తొలగించే ప్రక్రియ, ఇది ఒక గొప్ప నిర్ణయం ఈ నిర్ణయం. దేశానికే దిక్సూచి కాబోతున్నది తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి కి మరియు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క కి ధన్యవాదాలు తెలిపారు.

Join WhatsApp

Join Now