Site icon PRASHNA AYUDHAM

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత: జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్

IMG 20240801 212440

Oplus_0

IMG 20240801 212432
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత అని, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్, జూలై నెలలో ఆపరేషన్ ముస్కాన్ పేరుతో ప్రతి సంవత్సరం రెండు నెలల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ఈ కార్యక్రమాల ద్వారా బాల కార్మికులకు విముక్తి కల్పించి, స్కూల్ లకు పంపిస్తూ మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందన్నారు. గల నెల రోజులుగా అనగా జూలై 1 నుండి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్- ఎక్స్ లో భాగంగా వివిధ శాఖలు, పోలీసు శాఖ, చైల్డ్ లేబర్, సి.డబ్ల్యూ.సి, డి.సి.పి.యు. విద్యాశాఖ మరియు చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ మొదలైన శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి, ఆపరేషన్ ముస్కాన్-ఎక్స్ ను విజయవంతం చేయడం జరిగిందని, ఆపరేషన్ ముస్కాన్-ఎక్స్ టీంను జిల్లా ఎస్పీ రూపేష్ అభినందించారు. ఆపరేషన్ ముస్కాన్-ఎక్స్ లో భాగంగా ఈ సంవత్సరం మొత్తం 66 మంది బాల కార్మికులను రక్షించడం జరిగిందని, వీరిలో 63-మంది బాలురు, 03-మంది బాలికలు ఉన్నారు. బాలలను కార్మికులుగా పనిలో పెట్టుకున్న యజమానులపై 23 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లలను పనిలో పెట్టుకున్నా, వెట్టిచాకిరికి గురి చేసినా, బలవంతంగా బిక్షాటన చేయించినా, పశువుల కాపరులుగా, కిరాణం దుకాణాలు, మెకానిక్ షాపులు, హోటళ్లు, ఇటుక బట్టీలు, పౌల్ట్రీ ఫామ్ లు ఇతర ప్రదేశాలలోనూ పని చేయించడం, చట్టరీత్యా నేరం, ఎవరైనా పై చర్యలకు పాల్పడితే అట్టి వ్యక్తులపై చట్టరిత్య క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. బాల కార్మికులు ఎవరైనా కనిపించినట్లయితే చైల్డ్ లైన్ నెంబర్ 1098 లేదా డైల్ 100 కు గాని సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్పీ రూపేష్ తెలిపారు. 
Exit mobile version