భారత్, పోలండ్ మధ్య సామాజిక భద్రతా ఒప్పందం..

 

IMG 20240822 WA0127

భారత్, పోలండ్ మధ్య సామాజిక భద్రతా ఒప్పందం కుదిరినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ� గురువారం ప్రకటించారు. నూతన సాంకేతికతలు, స్వచ్ఛ ఇంధనం వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతమవుతోందని తెలిపారు. మోదీ బుధవారం పోలండ్కు చేరుకున్నారు. తొలుత అక్కడి ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. పోలాండ్లోని భారతీయ సమాజ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భారత్ ఏం చేసినా రికార్డుగా మారి చరిత్ర అవుతుందన్నారు. దీనితో పాటు భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడం గురించి కూడా మాట్లాడారు. ఈ సమయంలో ప్రజలు ఆయన ప్రసంగాన్ని శ్రద్ధగా వింటూ కనిపించారు.భారత ప్రధానుల్లో ఎవరూ గత 45 ఏళ్లలో పోలండ్కు వెళ్లలేదు. చివరిసారిగా 1979లో నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ పోలండ్ను సందర్శించారు.ఈ ఏడాది తొలిసారిగా పోలండ్ కబడ్డీ ఛాంపియన్షిప్నకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ నేపథ్యంలో భారత్, పోలండ్ మధ్య అనుబంధానికి ఈ ఆట మూలంగా ఉద్భవించిందని మోదీ గుర్తుచేశారు. భారత్ నుంచే కబడ్డీ పోలండ్కు చేరుకుందని తెలిపారు. దాన్ని ఆ దేశం మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిందని పేర్కొన్నారు…

Join WhatsApp

Join Now