సామాజిక ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల గణన సర్వే పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం నవంబర్ 05:
రేపటి (06-11-24) నుండి ప్రారంభమయ్యే సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం రోజున తాడ్వాయి మండల కేంద్రం, కామారెడ్డి పట్టణంలోని కళాభారతి లో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో చేపట్టే సర్వే పక్కాగా ఉండాలని, ఏ ఒక్క ఇల్లు , వ్యక్తి కూడా తప్పిపోకుండ పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వం జారీచేసిన బుక్లెట్స్ ఆధారంగా గణన చేపట్టాలని తెలిపారు. ఇప్పటికే ఎన్యుమ రేటర్ ల నియామకాలు పూర్తిచేయడం జరిగిందని, ప్రతీ మండల కేంద్రం, మున్సిపల్ కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు పవార్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో చేపట్టే సర్వే తప్పులు లేకుండా పూర్తి సమాచారంతో సేకరణ జరగాలని అన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే ముందే నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సీపీఒ రాజారాం, ఆయా మండల తహసీల్దార్, ఎంపీడీఓ లు, తదితరులు పాల్గొన్నారు.
సామాజిక ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల గణన సర్వే పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్..
by kana bai
Published On: November 5, 2024 10:16 pm