రాయలసీమలో 3 చోట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులు – ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
రాయలసీమ ప్రాంతంలోని కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో 3 చోట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు, ప్రోత్సాహకాలు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె ప్రాంతంలో 1050 మెగావాట్ల సామర్థ్యంలో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌కు అనుమతించింది.
శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం కాకుండా సున్నపురాళ్లపల్లెలో ప్రాజెక్టు ఏర్పాటునకు అంగీకరించింది.
అందుకు తగు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, జలవనరులు, పరిశ్రమలు, ఏపీ ట్రాన్స్‌కో అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని డోన్ పశ్చిమ ప్రాంతంలో పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 300 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును రీన్యూ వ్యోమన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఏర్పాటు చేయనుంది. అలాగే కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని డోన్ పశ్చిమ ప్రాంతంలో మరో పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమత