గుమ్మడిదలలో బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు

సంగారెడ్డి/పటాన్ చెరు, జూలై 6 (ప్రశ్న ఆయుధం న్యూస్): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని సీజీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్మల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… బాబు జగ్జీవన్ రామ్ సామాజిక సమానత్వానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత అని అన్నారు. వెనుకబడిన వర్గాల హక్కుల సాధనలో ఆయన పాత్ర అపూర్వమైందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గాన్ని అనుసరించి, సమాజాభివృద్ధిలో భాగస్వామ్యంగా మారాలని పిలుపునిచ్చారు. అంతే కాకుండా, అందరూ కలిసి ముందుకు సాగితేనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. దేవేందర్ రెడ్డి, సత్యనారాయణ, వాసు దేవ రెడ్డి, చంద్రారెడ్డి, సూర్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి,జైపాల్ రెడ్డి, సాయి యాదవ్, మురళి యాదవ్, ఉపేందర్ రెడ్డి,వాసు యాదవ్, అరవింద్ రెడ్డి, దోమడుగు రమేష్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment