*ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణాలర్పించిన అమరులకు ఘన నివాళులు*
*ఇల్లందకుంట మార్చి 1 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో గల గరుడ చౌరస్తాలో ఎం ఎస్ పి మండల అధ్యక్షుడు గుండ్ల గణపతి ఆధ్వర్యంలో శనివారం రోజున ఎస్సీ వర్గీకరణ పోరులో ప్రాణాలర్పించిన అమరులకు ఘనంగా నివాళి అర్పించారు
అమరుల త్యాగాలను కొనియాడుతూ పాటలు పాడుతూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమం లో నాయకులు తునికి వసంత్,దొడ్డే అనిల్, పర్లపల్లి రవీందర్ తదితరులు పాల్గొన్నారు