పంచముఖి కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారం!
తక్షణ స్పందనతో కొత్త మోటార్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుడు పంపరి లక్ష్మన్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 16
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ మరియు 41వ వార్డు ఇంచార్జి పంపరి లక్ష్మన్ పంచముఖి కాలనీ ప్రజల తాగునీటి సమస్యపై తక్షణమే స్పందించారు. కాలనీలోని బోరు మోటార్ పాడైపోవడంతో నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే లక్ష్మన్ స్వయంగా చొరవ తీసుకుని కొత్త మోటార్ ఏర్పాటు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరించారు. నాయకుడి ఈ సకాల సహాయానికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాలనీ సభ్యులు పాల్గొన్నారు.