కార్మిక సమస్యలు పరిష్కరించండి

భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఉప కార్మిక శాఖ అధికారికి వినతి

సిద్దిపేట జూలై 26 ( ప్రశ్న ఆయుధం ) :

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, తంబ్ ఇంప్రెషన్ తొలగించి పాత పద్ధతిలో భవన నిర్మాణ కార్మికులకు కార్డులు ఇవ్వాలని, సంక్షేమ, సలహా బోర్డులను ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐటీయూసీ అనుబంధం భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్త పిలుపుమేరకు జిల్లా అధ్యక్షులు బెక్కంటి సంపత్ ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేట జిల్లా ఉప కార్మిక శాఖ అధికారి శ్రీనివాస్ రావు కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె అశోక్ మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తంబ్ ఇంప్రెషన్ తొలగించి పాత పద్ధతిలో కార్డులు మంజూరు చేయాలని, ప్రమాదవశాత్తు మరణిస్తే కార్మికుల కుటుంబానికి 10 లక్షలు, సహజ మరణానికి 5 లక్షల రూపాయలు చెల్లించాలని, సంక్షేమ బోర్డు, సలహా మండలని వెంటనే ఏర్పాటు చేయాలని, 60 ఏళ్లు నిండిన భవన నిర్మాణ కార్మికునికి ప్రతి నెల 6వేలు పెన్షన్ ఇవ్వాలని, పిల్లల చదువులకు స్కాలర్షిప్ ఇవ్వాలని, పాండిచ్చేరి ప్రభుత్వం ఇస్తున్న తరహాలో దసరా పండగకు మూడు వేలు చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న పెన్షన్ ఇతర బెనిఫిట్స్ బకాయిలు చెల్లించి ఇన్ టైంలో రెన్యువల్ చేసుకుని వారికి రెన్యువల్ కు అనుమతి ఇవ్వాలన్నారు. కార్మికుల పిల్లలకు ఢిల్లీ, కర్ణాటక ప్రభుత్వాలు ఇస్తున్న తరహాలో స్కాలర్షిప్ లు ఇవ్వాలని, వలస కార్మికుల పేర్లు నమోదు చేసి గుర్తింపు రేషన్ కార్డులు ఇవ్వాలని, ప్రసూతి సౌకర్యం 50 వేలకు పెంచాలని, పెళ్ళి కానుక లక్ష రూపాయలకు పెంచాలని, ప్రస్తుత భవన నిర్మాణంలో ప్రభుత్వానికి కడుతున్న ఒక శాతం సెస్ ను రెండు శాతానికి పెంచాలని, కొత్త కార్డులు ఇప్పించే సందర్భంగా రెన్యువల్ చేసిన సందర్భంగా కానీ మీ సేవలో సాఫ్ట్ వేర్ వేగవంతాన్ని మెరుగుపరచాలని, పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఈరి భూమయ్య, ఉడుగుల శ్రీనివాస్, సిరిగిరి ముత్తిలింగం, పొన్నాల రేణుక, సురేందర్, మల్లేశం, రాజయ్య, సిద్ధులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now