రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంస్చై ర్మన్ కొత్వాల, కలెక్టర్ కు వినతి
పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని నవభారత్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర బృందావనం కాలనీ నివాసులు పలు సమస్యలు ఎదుర్కుంటున్నారని, వాటిని పరిష్కరించేలా మున్సిపల్ అధికారులకు తగు ఆదేశాలు ఇవ్వాలని డీసీఎంస్చై ర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావుకలెక్టర్ ను కోరారు.
ఈ మేరకు ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను కొత్వాలతోపాటు కాలనీ వాసులు కలిసి సమస్యలను విన్నవించారు. ఇటీవల బృందావనం కాలనీ నుండే మురికి కాలువను కొంతమంది పూడ్చి వేసిన విషయాన్నీ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మణ రావు తో మాట్లాడి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కొత్వాలమాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన బృందావనం కాలనీ లో ఎక్కువగా కేటీపీస్ఉ ద్యోగులు నివసిస్తున్నారని వారికి రోడ్డు, డ్రైన్, త్రాగునీటి సరఫరా చేపించాలని కలెక్టర్ ను కోరామన్నారు.
ఈ కార్యక్రమంలో కాలనీ వాసులతో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు వై వెంకటేశ్వర్లు, దారా చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.