ఉద్యమాలతో రైతు సమస్యల పరిష్కారం

*ఉద్యమాల ద్వారానే రైతు సమస్యల పరిష్కారం*

*తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్*

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 8*

ఐక్య ఉద్యమాలు పోరాటాల ద్వారానే రైతు సమస్యలు పరిష్కారo అవుతాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ అన్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో విత్తన రైతుల సంఘం రాష్ట్ర సదస్సుకు హాజరై నూతన కమిటీని ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో రైతు ఆత్మహత్యలు ప్రతి ఏటా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మోడీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా బడ్జెట్లో వ్యవసాయ రంగానికి తగిన నిధులు కేటాయించడం లేదని రైతుకు గిట్టుబాటు ధర లేకపోవడం మూలంగా పెట్టిన పెట్టుబడులు కూడా రావడంలేదని స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తే రైతాంగానికి మేలు జరుగుతుందన్నారు కార్పొరేట్ బహుళజాతి కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను తెస్తే రైతాంగం పెద్ద ఎత్తున 13 నెలల పాటు ఆందోళన పోరాటాలు నిర్వహించి మూడు నల్ల చట్టాలను వెనక్కి కొట్టారని గుర్తు చేశారు దేశంలోనే గుర్తుండిపోయే చారిత్రాత్మకమైన పోరాటంగా అభివర్ణించారు వ్యవసాయం రైతుకు లాభసాటి అయ్యే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధివిధానాలు రూపొందించాలని విత్తన ఉత్పత్తి రైతుల సంఘం నూతన కమిటీ రాష్ట్రవ్యాప్తంగా విత్తన రైతుల ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి రైతులను ఐక్యం చేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

*అనంతరం పలు తీర్మానాలు చేశారు*

పంట నష్టపోయిన రైతులకు విత్తన కంపెనీలే నష్టపరిహారం చెల్లించాలని
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని ప్రతి రైతు కుటుంబానికి ఒక ఉద్యోగం, 20 లక్షల పరిహారం చెల్లించాలని
జర్మనేషన్ టెస్ట్లు రైతుల ముందే చేయాలని ఎలాంటి కటింగులు పెట్టకూడదని ఉత్పత్తి ఒప్పందం కంపెనీ రైతులతో చేసుకున్నప్పుడు రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ ద్వారా డిపాజిట్ చేయాలని విత్తన ఉత్పత్తి భూమిలో పనిచేయడం వలన చర్మవ్యాధులు క్యాన్సర్ గుండె జబ్బులు వస్తున్నాయని హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని
సమగ్రమైన రైతు రక్షణ చట్టం చేయాలని
రైతుల నుండి సేకరించే విత్తనాలకు శాస్త్రీయంగా ధర నిర్ణయించి అమలు చేయాలని నకిలీ విత్తనాలను అరికట్టాలని అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని
విత్తన రైతుకు సాంకేతిక సలహాలు వడ్డీ లేని రుణ సౌకర్యం కంపెనీలు కల్పించాలని ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టాలకు కంపెనీలే బాధ్యత వహించాలని విత్తన రైతులకు పంటల బీమా రైతు బీమా ప్రీమియం కంపెనీలే చెల్లించాలని
విత్తన రైతులకు శాస్త్రవేత్తలతో సమావేశాలు ఏర్పాటుచేసి ట్రైనింగ్ ఇప్పించాలని మార్కెట్ కమిటీల ద్వారా విత్తనోత్పత్తి రైతులకు సలహాలు సూచనలు విత్తన నిల్వ సౌకర్యం కల్పించాలని తీర్మానాలు చేశారు ఈ సదస్సులో జిల్లా ప్రధాన కార్యదర్శి వెల్మారెడ్డి రాజిరెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యులు మిల్కూరి వాసుదేవరెడ్డి జిల్లా నాయకులు శీలం అశోక్ గుండేటి వాసుదేవ్ కాయిత లింగారెడ్డి బి రాజు అశోక్ రెడ్డి రాజిరెడ్డి యుగంధర్ మల్లయ్య తిరుపతి శోభన్ లతోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.

*నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక…

విత్తనోత్పత్తి రైతుల
సంఘం రాష్ట్ర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కన్వీనర్ గా వర్ణ వెంకట్ రెడ్డి కమిటీ సభ్యులుగా చల్లారపు తిరుపతిరెడ్డి శ్రీనివాసరావు బాసిర సంపత్ రావు చెలుపూరి రాములు వి.చంద్రమౌళి రమాదేవి రాయిశెట్టి రమేష్ లు ఎన్నికయ్యారు.

Join WhatsApp

Join Now