సమత నగర్ కాలనీ లో మంచి నీరు సరఫరా సమస్య పరిస్కారం 

సమత నగర్ కాలనీ లో మంచి నీరు సరఫరా సమస్య పరిస్కారం

ప్రశ్న ఆయుధం జనవరి 10: కూకట్‌పల్లి ప్రతినిధి

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్ కాలనీ పార్క్ వద్ద మంచి నీరు సరఫరా సమస్య గురించి అపార్ట్మెంట్ నివాసితుల అభ్యర్థన మేరకు తక్షణమే స్పందించి లైన్ మెన్ను పిలిచి సరఫరా సమయంలో వచ్చి సమస్య ను అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని చెప్పిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు. ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ, సమత నగర్ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న మంచి నీటి సరఫరా ఇబ్బందులను, సమస్యలను పరిగణలోకి తీసుకోని, వారి విజ్ఞప్తి మేరకు కాలనీలలో పర్యటించడం జరిగినది అని, ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, సంతులిత, సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. అదేవిధంగా కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని, కాలనీ వాసులందరి సమిష్టి కృషి తో ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దుతామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అదేవిధంగా డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు వాటర్ లైన్ మెన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment