చిన్నపోతంగల్‌లో మురికినీటి సమస్య పరిష్కారం — వెంటనే స్పందించిన సెక్రటరీ వనజ

చిన్నపోతంగల్‌లో మురికినీటి సమస్య పరిష్కారం — వెంటనే స్పందించిన సెక్రటరీ వనజ

గాంధారి, అక్టోబర్ 25 (ప్రశ్న ఆయుధం):

గాంధారి మండలానికి సమీపంలోని చిన్నపోతంగల్ గ్రామంలో మురికి కాలువ నీరు నిల్వ ఉండడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని స్థానికులు వెంటనే గ్రామపంచాయతీ కార్యదర్శి వనజ దృష్టికి తీసుకెళ్లారు.

సమస్య తెలిసిన వెంటనే సెక్రటరీ వనజ సిబ్బందిని తరలించి, కాలువల శుభ్రపరిచే పనులను ప్రారంభించించారు. గ్రామంలో నిల్వ నీటిని పూర్తిగా తొలగించి, మురికి కాలువలను పరిశుభ్రంగా ఉంచే చర్యలు చేపట్టారు.

తక్షణ స్పందనతో సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్తులు సెక్రటరీ వనజను అభినందించారు. ప్రజల సమస్యలపై తక్షణ స్పందన చూపడం అధికారులు చూపాల్సిన నిబద్ధతకు నిదర్శనం అని స్థానికులు ప్రశంసించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment