ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 12 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పోతులబొగుడ గ్రామంలో నీటి సమస్య ఏర్పడడంతో పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి స్పందించి తన సొంత నిధులతో బోరు వేయించారు. అదే విధంగా గురువారం రూ. 40,000 విలువ చేసే బోరు మోటారు, పైపులను గురువారం అందజేసి నీటి సమస్యను పరిష్కరించారు. దీంతో గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మంద ప్రవీణ్, సిద్దిరములు, పందుల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.