తల్లిపై అనుమానంతో గొంతు నులిమి చంపిన కొడుకు

తల్లిపై అనుమానంతో గొంతు నులిమి చంపిన కొడుకు

తల్లిపై అనుమానంతో కుమారుడు గొంతు నులిమి చంపిన సంఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. అలిపిరి ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం తిరుపతిలో షోరూమ్‌లో పని చేస్తున్న శారదపై కుమారుడు ధనుష్ కుమార్ వివాహేతర సంబంధ అనుమానంతో గురువారం రాత్రి మద్యం మత్తులో గొడవపడ్డాడు. ఏదైనా పని చేసి బతకమని తల్లి చెప్పడంతో ముఖంపై కొట్టడంతో కిందపడిపోగా ఆమె గొంతు నులిమి చంపాడు. శుక్రవారం అమ్మమ్మకు సమాచారం ఇచ్చాడు. నిందితుడు ఇంటర్ మధ్యలో ఆపేసి జులాయిగా తిరుగుతున్నాడు. అతని తండ్రి ఏడాది క్రితం కువైట్ వెళ్ళాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment