హైదరాబాద్ నుండి సంక్రాంతి పండుగకు అత్తారింటికి వచ్చిన అల్లుడు మిస్సింగ్..!

*హైదరాబాద్ నుండి సంక్రాంతి పండుగకు అత్తారింటికి వచ్చిన అల్లుడు మిస్సింగ్..*

*ఇంట్లో నుంచి వెళ్లి 42 గంటలు అవుతున్న తెలియని యువకుని ఆచూకీ…*

*ఆందోళనకు గురవుతున్న యువకుడి భార్య, బంధువులు..*

*గత నెల 26న వివాహం…*

*పాలకుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భార్య జయంతి..*

పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామంలోని అత్తారింటికి హైదరాబాదు నుండి సంక్రాంతి పండుగకు వచ్చిన అల్లుడు మిస్సింగ్ అయ్యాడు. ఇంట్లో నుండి వెళ్లి 42 గంటలు దాటుతున్న ఆచూకీ దొరకపోవడంతో అతని భార్య, బంధువులు ఆందోళనకు గురవుతున్నారు.

హైదరాబాదులోని కొత్తపేటకు చెందిన నాలుకల రవికుమార్ కు పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామానికి చెందిన జయంతితో గత నెల 26న వివాహం జరిగింది. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని భార్య జయంతి 10 రోజుల క్రితమే బొమ్మర గ్రామానికి రాగా, ఆమె భర్త రవికుమార్ కనుమ పండుగ (బుధవారం) రోజున అత్తారింటికి మధ్యాహ్నం వచ్చాడు. అదే రోజు రవి కుమార్ భార్య జయంతితో కలిసి బొమ్మెర గ్రామ శివారులోని ఎల్లమ్మ గడ్డ తండాలో జరిగే ఆలేటి ఎల్లవ్వ జాతరకు సాయంత్రం 4:30గంటల ప్రాంతంలో వెళ్లి ఇంటికి తిరిగి సాయంత్రం 6:30 గంటలకు వచ్చారు. రాత్రి 7:30 గంటల సమయంలో స్నేహితులు ఫోన్ చేస్తున్నారని, వారి కలిసి మాట్లాడి వస్తానని అత్తారింట్లో భార్య జయంతికి చెప్పి ఇంట్లో నుండి వెళ్ళాడు. అతని భార్య 8:30 గంటల ప్రాంతంలో ఫోన్ చేయగా స్నేహితులతో మాట్లాడి వస్తానని, వారి కారులోనే మళ్లీ మీ ఇంట్లో డ్రాప్ చేసి వెళ్తారని అని చెప్పాడు. ఆ తర్వాత అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అత్త, మామ, భార్యలు రవి కుమార్ బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసిన ఆచూకీ దొరకలేదు. భార్య జయంతి ఆందోళన గురై గురువారం మధ్యాహ్నం పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జయంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పాలకుర్తి సిఐ మహేందర్ రెడ్డి, ఎస్సై దూలం పవన్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. రవికుమార్ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ కావడంతో పోలీసుల దర్యాప్తుకు ఆటంకం ఏర్పడింది. అతను కాల్ లిస్ట్ తీసుకుని ఆ రోజు ఎవరెవరితో మాట్లాడారో వివరాలు రాబడుతూ, కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో నుండి రవికుమార్ వెళ్లి 42గంటలు దాటడంతో అతనికి ఏం జరిగిందోనని భార్య జయంతి, బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి కూడా 20గంటలు దాడుతున్న ఎలాంటి వివరాలు చెప్పకపోవడంతో మరింత వారు ఆందోళన చెందుతున్నారు.

Join WhatsApp

Join Now