Site icon PRASHNA AYUDHAM

అత్తను హత్య చేసిన అల్లుడు

IMG 20250703 WA0416 1

అత్తను హత్య చేసిన అల్లుడు

 

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 3

 

పిట్లం మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పండించిన పంట డబ్బుల విషయంలో తలెత్తిన చిన్న పాటి గొడవ, హత్యకు దారితీసింది.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన జిన్నా లక్ష్మీ, (43) ఆమె అల్లుడు భాగరాజుకు, పండించిన జొన్న పంటకు, వచ్చిన డబ్బుల విషయంలో గురువారము ఉదయం గొడవ జరిగిందని తెలిపారు. గ్రామస్తులు సద్ది చెప్పడంతో వెళ్లిపోయిన భాగరాజు తిరిగి మధ్యాహ్నం గ్రామంలో గల పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అత్త అయిన జిన్నా లక్ష్మీపై పదునైన ఆయుధాలతో, దాడి చేసి హత్య చేశాడని పేర్కొన్నారు. సంఘటనను గమనించిన గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే ఆమె మృతి చెందడంతో పోలీసులకు సమాచారం ఇచ్చామని అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. సంఘటన తెలుసుకున్న బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. నిందితున్ని త్వరలో పట్టుకొని చట్టరీత్యా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలిస్తామన్నారు. ఆయన వెంట రూరల్ సీఐ రాజేష్, ఎస్సై రాజు పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Exit mobile version