Site icon PRASHNA AYUDHAM

16 ఎకరాల ఆస్తి పంచి ఇచ్చినా..  పెన్షన్ కోసం 89 ఏండ్ల తండ్రిని ఇంటి నుండి గెంటేసిన కొడుకులు

IMG 20250313 WA0060

*16 ఎకరాల ఆస్తి పంచి ఇచ్చినా*..

*పెన్షన్ కోసం 89 ఏండ్ల తండ్రిని ఇంటి నుండి గెంటేసిన కొడుకులు*

నలుగురు కొడుకులు ఉన్నా అన్నం పెట్టే వాడే లేడు, నన్ను పెన్షన్ కోసం ఇంటి నుండి గెంటేసారు అంటూ ప్రజావాణి వద్ద వృద్ధ తండ్రి ఆవేదన

నడవడానికి కూడా చేతగాక చక్రాల కుర్చీలో కూర్చున్న ఈయన పేరు పిల్లల నారాయణ.. విశ్రాంత ఉపాధ్యాయుడు వయసు 89 ఏళ్లు.

కమలాపూర్ మండలం గూడూరుకు చెందిన ఈయనకి నలుగురు కుమారులు. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు కాగా.. ఒకరు గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు

తాను సంపాదించిన 16 ఎకరాల భూమిని అందరికీ సమానంగా పంచి ఇచ్చి.. పింఛను డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. భార్య మరణించింది.

ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ముగ్గురు కుమారులు ఇటీవల పింఛను డబ్బుల కోసం వేధిస్తూ.. ఇంటికి తాళం వేసి తనను బయటకు గెంటేశారని ప్రజావాణికి వచ్చి గోడు చెప్పుకున్న వృద్ధుడు

ప్రస్తుతం అదే ఊళ్లో అద్దె ఇంట్లో ఉంటున్నానని, కుమారులు ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వద్ద కన్నీటి పర్యంతమయ్యారు

Exit mobile version