డాక్టర్ మద్దెల శివకుమార్!*
ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు6
కొత్తగూడెం డివిజన్ ఆర్ సి పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22వ తేదీని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలలో, చిరంజీవి సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు స్వామి నాయుడు చీఫ్ ఆర్గనైజర్ గా, నిర్వహించబడుతున్న మెగాస్టార్ పాటల పోటీలుకొత్తగూడెంలో ఈనెల 8వ తేదీన( శుక్రవారం) ఉదయం 11 గంటల నుండి సాయంత్రం వరకు నిర్వహించడం జరుగుతుందనిగిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ వెల్లడించారు.కేవలం మన ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల కళాకారులు మాత్రమే అర్హులు.
ఈ పోటీలో న్యాయ నిర్ణీతలచే ఒకటి రెండు మూడు స్థానాలను పొందిన గాయని గాయకులను హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే సెమీఫైనల్స్ కు తిరిగి అక్కడ సెలెక్ట్ అయిన నాయకులను ఆగస్టు 22వ తేదీ హైదరాబాదులోనే శిల్పకళా వేదికలో జరిగే ఫైనల్స్ లో సెలెక్ట్ చేసి,రంగ రంగ వైభవంగా అతిరథ మహారధుల మధ్య బహుమతి ప్రధానోత్సవం జరుగుతుందని,సినీ రంగ ప్రముఖుల తీసుకోబడుతున్న ఈ బహుమతులను మర్చిపోలేని జ్ఞాపకాలుగా మిగులుతాయని అంతేగాక తమ తమ సామర్ధ్యాలను ప్రతిభ పాటవాలను పెద్దల ముందు ఎలివేట్ చేసే అతి సువర్ణమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మద్దెల పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పాల్గొని పిలుపునిచ్చిన వారిలో చిరంజీవి సేవ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బి విల్సన్ బాబు, అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అపరబాలు అల్లి శంకర్,సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు సినీ నటులు తాండూర్ ధనరాజ్ తదితరులుపాల్గొన్నారు.
ఈనెల 8 న కొత్తగూడెంలో పాటల పోటీలను జయప్రదం చేయండి
by Naddi Sai
Published On: August 6, 2025 6:57 pm