సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలోసోనియాగాంధీ జన్మదినవేడుకలు

చంద్రబోస్
Headlines
  • వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం
  • సోనియా గాంధీ వల్లే తెలంగాణ ఏర్పడింది: వనపర్తి ఎమ్మెల్యే వ్యాఖ్యలు
  • పెబ్బేరు పట్టణంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం
  • కేటీఆర్‌పై వనపర్తి ఎమ్మెల్యే విమర్శలు: “అహంకారం తగ్గించుకోవాలని”

– ముఖ్య అతిధి వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి

–సోనియా గాంధీ వల్లే తెలంగాణ,ఆమె లేనిదే ప్రత్యేక రాష్ట్రం లేదు

–కాంగ్రెస్ పట్టణ మండలనాయకుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు

సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని, ఆమె లేనిదే ప్రత్యేక రాష్ట్రం లేదని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.కాంగ్రెస్‌ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. రాజీవ్‌ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించిందని, కేటీఆర్‌ తెలంగాణ కోసం ఏం త్యాగం చేశారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పెబ్బేరు పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలో సోమవారం పెబ్బేరు పట్టణ,మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో సోనియాగాంధీ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొన్నారు. ముందుగా కేక్ కట్ చేసి ఆయన మాట్లాడుతూ అధికారం కోల్పోయినా కేటీఆర్‌లో ఏమాత్రం అహంకారం తగ్గలేదని,ఇప్పటి కైనా ఆయన పగటికలలు కనడం మానుకోవాలని హితవు పలికారు.బీఆర్‌ఎస్‌ హయాంలో లక్షల కోట్ల దోపిడీ జరిగిందని,ఇక ఆ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉందని కితాబు ఇచ్చారు.సీఎం రేవంత్‌ పాలనలో ఎలాంటి నిర్బంధం లేదని.. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా నిరసన తెలుపుకొనే అవకాశం ఉందని చెప్పారు.శాంతి భద్రతలకు భంగం కల్గించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ప్రమోదినిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్ రెడ్డి,కౌన్సిలర్లు అశ్విని సత్యనారాయణ,అక్కమ్మ,కాంగ్రెస్ నాయకులు వెంకటరమణ,రామిరెడ్డి, శ్రీహరి రాజు,ఎస్సీ సెల్ నాయకులు గంధం రాజశేఖర్,గంధం రంజిత్ కుమార్,యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాజేష్,యుగేందర్ రెడ్డి,దయాకర్ రెడ్డి,మార్కెట్ డైరెక్టర్లు రామన్ గౌడ్,నరసింహనాయుడు,సురేందర్ గౌడ్,వెంకటేష్ సాగర్, సత్యనారాయణ రెడ్డి,మల్లేష్ యాదవ్,కావలి బాలస్వామి,బాపనపల్లి రమేష్,గొడుగు పెద్ద ఎల్లస్వామి,మాజీ డైరెక్టర్ రాములు,శివ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now