రేవంత్ పై సోనియా సీరియస్..
తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా విధ్వంసం సృష్టిస్తోంది. హైదరాబాద్ మహానగరంలో చెరువులు కబ్జా చేసి కట్టిన కట్టడాలను కూల్చేందుకు హైడ్రాను తీసుకువచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.అలాగే నాళాల పైన నిర్మించిన ఇండ్లను కూడా కూల్చేస్తోంది. ఇప్పటికే 50 మంది ప్రముఖుల… ఫామ్ హౌస్ లను అలాగే ఇండ్లను కూడా ధ్వంసం చేసింది హైడ్రా. నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూడా.. కుప్ప కూలింది. అయితే తాజాగా… కాంగ్రెస్ సీనియర్ నేత పల్లంరాజు కు సంబంధించిన కట్టడాలను కూడా హైడ్రా కూల్చివేసింది. అయితే దీనిపై రేవంత్ రెడ్డి కి ఫోన్ చేసినా కూడా ఆయన లిఫ్ట్ చేయలేదట. దీంతో నేరుగా ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీకి పల్లం రాజు ఫిర్యాదు చేశారట. కాంగ్రెస్ పార్టీలో.. నమ్మిన బంటుగా ఉన్న తన ప్రాపర్టీ పైన.. రేవంత్ రెడ్డి చెయ్యి వేయడంపై ఫిర్యాదు చేశారట పల్లంరాజు. దీంతో సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలు ఎవరో తెలియదా? ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే బాగుండదని కూడా సోనియాగాంధీ హెచ్చరించారట. Hydraఇకపై హైడ్రా చేసే విధ్వంసాన్ని… కంట్రోల్ చేయాలని కూడా సోనియా గాంధీ…రేవంత్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చారట. ముఖ్యంగా కాంగ్రెస్ నేతల ప్రాపర్టీ ముట్టుకోకూడదని కూడా హెచ్చరికలు జారీ చేశారట సోనియాగాంధీ.