ఆస్తి పంచుకొని తల్లిదండ్రులను రోడ్డున పడేసిన కొడుకులు

ఆస్తి పంచుకొని తల్లిదండ్రులను రోడ్డున పడేసిన కొడుకులు

కరీంనగర్ జిల్లా కలెక్టరుకు చెప్పుకుందామని వచ్చిన వృద్ద దంపతులు

ఆపరేషన్ జరిగినా కూడా పట్టించుకోని కొడుకులు.. 10 సంవత్సరాలుగా తల్లిదండ్రులను తిడుతూ, కొడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్న కొడుకులు, కోడళ్ళు

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన రేగుల నర్సయ్య–లక్ష్మీ అనే వృద్ధ దంపతులు తమ కొడుకులు అన్నం పెట్టడంలేదని కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడానికి వచ్చారు

భూభారతి కార్యక్రమం ఉండడంతో అధికారులు ప్రజావాణిని రద్దుచేశారు

చేసేదేమీలేక కలెక్టరేట్ ఆవరణలోని చెట్ల కింద కూర్చొని కన్నీటిపర్యంతం అయ్యారు

తమ కొడుకులు ఆస్తి మొత్తం పంచుకొని కనీసం బుక్కెడు బువ్వ కూడా పెట్టడంలేదని, అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు

Join WhatsApp

Join Now