వెంటనే పిల్లల్ని కనండి! తమిళ ప్రజలకు సీఎం స్టాలిన్‌ పిలుపు

తమిళనాడుపై కత్తి వేలాడుతోంది.. వెంటనే పిల్లల్ని కనండి! తమిళ ప్రజలకు సీఎం స్టాలిన్‌ పిలుపు

కొత్తగా పెళ్లైన వాళ్లు వెంటనే పిల్లల్ని కనాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ పిలుపునిచ్చారు. తమిళనాడుపై కత్తి వేలాడుతోందని, పిల్లల్ని ఎక్కువగా కనకపోతే రాష్ట్రం రాజకీయంగా తీవ్రంగా నష్టపోతుందని కూడా స్టాలిన్‌ తమిళ ప్రజలను హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ స్థానాల పునర్విభజన చేపడుతున్న నేపథ్యంలో స్టాలిన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. జనాభా ప్రతిపదికన లోక్‌ సభ నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ లోక్‌ సభ నియోజకవర్గాల డీలిమిటేషన్‌ వల్ల తమిళనాడుకు లోక్‌ సభ సీట్లు తగ్గుతాయని, దాంతో రాజకీయంగా తమిళనాడు ప్రాధాన్యత కోల్పోతుందని సీఎం స్టాలిన్‌ అన్నారు.

కేంద్ర ప్రభుత్వ జనాభా సంఖ్య ఆధారంగా లోక్‌ సభ నియోజకవర్గాలను పునర్విభజిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో లోక్‌ సభ సీట్ల సంఖ్య పెరిగి, బీజేపీయేతర పార్టీ, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టాలిన్‌ ఇచ్చిన పిలుపు చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now