త్వరలో ఉపరాష్ట్రపతి ఎన్నిక!
Jul 22, 2025,
త్వరలో ఉపరాష్ట్రపతి ఎన్నిక!
జగదీప్ ధనఖడ్ రాజీనామా చేయడంతో రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. కొత్తగా ఎన్నికయ్యే వ్యక్తి పూర్తి ఐదేళ్ల పదవీకాలం పాటు ఉంటారు. నిబంధనల ప్రకారం, ఉపరాష్ట్రపతి పదవీ కాలం పూర్తయితే 60 రోజుల్లోగా ఎన్నిక నిర్వహించాలి. ఈ పదవికి పోటీ చేయాలంటే కనీసం 20 మంది ఎంపీలు ప్రతిపాదన చేయాలి. ఈసారి ఎన్నికల్లో NDA, INDI కూటముల మధ్య గట్టిపోటీ ఉండనుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.