త్వరలో పంచాయతీ మరియు స్థానిక సంస్థల ఎన్నికలు – రిటర్నింగ్ ఆఫీసర్లకు శిక్షణ

  •  రిటర్నింగ్ ఆఫీసర్లు (RO) కోసం స్టేజ్-1 & స్టేజ్-2 శిక్షణ
  •  నామినేషన్, పరిశీలన, పోలింగ్, కౌంటింగ్‌పై సూచనలు
  • ఈవీఎంల భద్రత, సిబ్బంది సమన్వయం, చట్టపరమైన నిబంధనలపై అవగాహన
  • పాల్గోన్న ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, గాంధారి, లింగంపేట్ మండలాల అధికారులు

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 25, (ప్రశ్న ఆయుధం):

ఎల్లారెడ్డి మండలంలోని మీసన్‌పల్లి రైతు వేదిక వద్ద రాబోయే పంచాయతీ (సర్పంచ్‌, వార్డు మెంబర్), స్థానిక సంస్థలు ( ఎం.పి.టి.సి., జడ్.పి.టి.సి.) ఎన్నికల నిర్వహణలో భాగంగా రిటర్నింగ్ ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ స్టేజ్-1 & స్టేజ్-2 దశల్లో కొనసాగింది.

కార్యక్రమంలో ఆర్‌డీవో, డీఎల్పిఓ, ఎం‌పీడిఓతో పాటు ఎన్నికల విభాగ అధికారులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్లు చేపట్టాల్సిన బాధ్యతలు, నిబంధనలు, పారదర్శకత, న్యాయబద్ధతపై సమగ్రంగా మార్గదర్శకాలు అందించారు.

శిక్షణలో నామినేషన్ స్వీకరణ, అభ్యర్థుల పరిశీలన, పోలింగ్ కేంద్రాల ఏర్పాటులో జాగ్రత్తలు, పోలింగ్ సిబ్బంది కేటాయింపు, ఈవీఎం భద్రత, ఓటింగ్ రోజు సమస్యల పరిష్కారం, కౌంటింగ్ విధానం, ఫలితాల ప్రకటన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, గంధారి, లింగంపేట్ మండలాల రిటర్నింగ్ ఆఫీసర్లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణలో తప్పులు చోటు చేసుకోకుండా సమన్వయంతో, చట్టబద్ధంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.

Join WhatsApp

Join Now