హైదరాబాద్ – గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గెస్ట్ హౌస్లో రేవ్ పార్టీని మాదాపూర్ SOT పోలీసులు భగ్నం చేశారు. 18 మంది యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగుల, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, సినీరంగానికి చెందిన వారు ఉన్నారు. నిందితుల నుంచి గంజాయి ప్యాకెట్లు, ఈ-సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు.. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.