*కామారెడ్డి సబ్ జైలుని పరిశీలించిన సౌమ్య మిశ్రా ఐపీఎస్*
కామారెడ్డి సబ్ జైలుని డా. సౌమ్య మిశ్రా ఐపీఎస్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ , ఎం సంపత్ డిఐజి ఆఫ్ ప్రిజన్స్ వరంగల్ రేంజ్ హైదరాబాద్, శ్రీమతి సింధు శర్మ ఐపీఎస్ ఎస్పీ ఆఫ్ కామారెడ్డి లు కామారెడ్డి పట్టణ సబ్ జైలును సందర్శించారు. దీనిలో భాగంగా సబ్ జైల్ కామారెడ్డి జైలులో ఖైదీల యోగక్షేమాలు, భోజన వసతులు, న్యాయ సేవ, ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. జైలులో గార్డెనింగ్ నిర్వహణ, పరిశుభ్రత బాగుందని అధికారులను అభినందించి, పలు రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చైతన్య రెడ్డి ఏఎస్పీ ఆఫ్ కామారెడ్డి, సబ్ జైలు అధికారి ఆనందరావు సూపర్డెంట్ ఆఫ్ సెంట్రల్ ప్రిజన్ నిజామాబాద్, సబ్ జైల్ పర్యవేక్షణ అధికారి సిహెచ్ సంజీవరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.