మల్లాయిపల్లిలో ప్రభుత్వ పాఠశాలకు సౌండ్ స్పీకర్, మైక్ అందజేత

మల్లాయిపల్లిలో ప్రభుత్వ పాఠశాలకు సౌండ్ స్పీకర్, మైక్ అందజేత

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 15 (ప్రశ్న ఆయుధం):

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని మల్లాయిపల్లి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యా కార్యకలాపాలకు అవసరమైన సౌండ్ స్పీకర్, మైక్‌ను ఈసిఎస్ ఫౌండేషన్ ఎండి చంద్రశేఖరన్ ఉచితంగా అందజేశారు.

పాఠశాలలో జరిగే సాంస్కృతిక, విద్యా కార్యక్రమాలకు ఈ పరికరాలు అవసరమని ఉపాధ్యాయులు కోరగా, వెంటనే స్పందించిన చంద్రశేఖరన్ వాటిని అందజేసినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.

చంద్రశేఖరన్  సహకారానికి పాఠశాల ఉపాధ్యాయులు విశ్వనాథం, సంతోష్‌తో పాటు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment