సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ రీజినల్ సమావేశం

సంగారెడ్డి, పటాన్ చెరు, నవంబరు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ యూనియన్ మీటింగ్ సికింద్రాబాద్ పరిధిలోని డైమండ్ పాయింట్ లో విజయవంతంగా కొనసాగింది. తెలంగాణ పరిధిలోని కస్టమర్ సర్వీస్ అసోసియేట్లు (క్లర్క్లు) అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్.బి.ఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ ప్రెసిడెంట్ నరేంద్ర కుమార్, డిప్యూటి జనరల్ సెక్రటరీ శ్రీనివాస చారిలు హాజరయ్యారు. సభ్యుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్టు యూనియన్ జనరల్ సెక్రటరీ అంజిల్ ప్రెసిడెంట్ సజో జోష్ లు సెంతిల్ కుమార్, మెట్టు శ్రీధర్, ఆనంద్ కుమార్ లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియన్ బ్యాంక్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment