70 కోట్లతో బంగ్లా..
120 కోట్లతో ప్రైవేట్ జెట్ కొనేసిన సౌత్ స్టార్ హీరో!
సినీ పరిశ్రమకి చెందిన నటీనటులకు పర్సనల్ గా కొన్ని స్పెషల్ ఇంట్రెస్ట్ లు ఉంటూనే ఉంటాయి. ఒకరికి మంచి డిజైనర్ కార్లు మార్కెట్ లోకి వచ్చిన కొత్త కారు లేదా బైక్ లు కొనుకుంటారు. ఇంకొందరు ఖరీదైన వాచ్ లు, మరికొందరు జంతు ప్రేమికులు అయితే కుక్కలు, గుర్రాలు ఇలా రకరకాల టేస్ట్ లు చూపిస్తూ తమ పర్సనల్ లైఫ్ లో తమకి నచ్చినట్టుగా లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారుఅయితే ఆ అందరితో పాటుగా మరికొందరు ఇంకొంత బ్రాడ్ గా ఆలోచించే వాళ్లలో అది కూడా పెద్ద స్టార్స్ అయితే మాత్రం తమ చెయ్యి చిన్న చిన్న వాటి మీద పెట్టరు. కొడితే వందల కోట్ల లోనే ఖర్చు పెడతారు. అలానే చాలా మంది స్టార్ హీరోస్ లో ప్రపంచ వ్యాప్యంగా అనేక దేశాల్లో ప్రత్యేక బంగ్లాలు, స్పెషల్ ఫ్లైట్ లు ఇంకా ప్రపంచ ప్రీమియం బ్రాండ్ కార్లు లాంటివి కొనుగోలు చేస్తుంటారు. వాటి కోసం ఎంతైనా వారు ఖర్చు పెట్టేందుకు వెనుకాడరుకాగా ఇలానే మన సౌత్ కి చెందిన ఓ స్టార్ హీరో తాజాగా ఓ ప్రైవేట్ విమానాన్ని కొనేసినట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఆ హీరో ఏకంగా ఒకటి రెండు కాదు ఏకంగా 120 కోట్ల రూపాయలు పెట్టి తనకంటూ సెపరేట్ జెట్ ఉండాలని కొనుగోలు చేసాడట. కాగా ఆ హీరో మరెవరో కాదు తెలుగు, తమిళ ఆడియెన్స్ కి బాగా సుపరిచితం అయ్యిన హీరో సూర్యనే అట..