చల్లని కబురు.. 27న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు..

*చల్లని కబురు.. 27న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు..*

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు చల్లటి కబురు అందింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే భారత్ లో ప్రవేశించనున్నట్లు వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు పలకరిస్తుంటాయి. ఈ సారి మాత్రం మే 27 నాటికే కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. గత ఏడాది మే 30న, 2023లో జూన్ 8న, 2022లో మే 29న రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. ఈ సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మే 21నాటికి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని ఆ తర్వాత పరిస్థితులన్నీ అనుకూలిస్తే ముందుగా కేరళను తాకుతాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు..

Join WhatsApp

Join Now