ప్రశ్నయుధం స్టేట్ బ్యూరో జూలై25
పదోన్నతి పొందిన ఏఎస్ఐని అభినందించిన ఎస్పీబాసర పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ లక్ష్మారెడ్డి ఏఎస్ఐ గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల పదోన్నతి పొందిన లక్ష్మారెడ్డిని సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయకుండా ఉద్యోగంలో పనిచేసే ప్రతి ఒక్కరికి ఉన్నత స్థాయికి చేరే అవకాశాలు ఉంటాయన్నారు.