Site icon PRASHNA AYUDHAM

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ..

IMG 20250312 120350

Oplus_131072

సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల, సెయింట్ ఆంథోని పాఠశాల పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. ఈ నెల 6వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 125 బి.యన్.యస్.యస్, (144) సెక్షన్ అమలులో ఉంటుందని, సెంటర్ల వద్ద గుంపులు, గుంపులుగా తిరగడ్డానికి వీలులేదని, 100 మీటర్ల దూరం వరకు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎలాంటి జిరాక్స్ సెంటర్స్ ఓపెన్ చేయకూడదని అన్నారు. పరీక్ష కేంద్రాలలోనికి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాలలోనికి అనుమతించరాదని సిబ్బందికి సూచించారు.

Exit mobile version