సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): “తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం” సందర్భంగా సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఉదయం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ జాతీయ జెండాను ఆవిష్కరించి, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలపన చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… పోలీసు అధికారులకు, సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, హైదరాబాద్ సంస్థానం నిజాం నిరంకుశ పాలనలో ఉండేదనీ, ఆనాటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో చేపట్టిన ఆపరేషన్ పోలో విజయవంతమై, అప్పటి నిజాంరాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1948 సెప్టెంబర్ 17 సాయంత్రం 5గంటలకు రేడియోలో ఉపన్యాసిస్తూ హైదరాబాద్ సంస్థానం..! భారత యూనియన్ లో అంతర్భాగం అని ప్రకటించడం జరిగిందనీ అన్నారు. కావున ఈ రోజును మనం “తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం”గా జరుపుకుంటున్నామని అన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం అనగా ప్రజలచేత, ప్రజలకొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం అని, ప్రజల సంక్షేమం కొరకు అనేక పథకాలు అమలు చేస్తూ.., ప్రతి పల్లె, ప్రతి వాడ, ప్రతి ఇంటి వరకు ప్రభుత్వ సేవలను చేరవేయడం ప్రజాపాలన ప్రధాన ధ్యేయం అని, ఇది “ప్రజల పాలన” అనే లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుందనీ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన మొదటి రోజు ఏ విధంగానైతే సమాజ సేవ చేయాలని ఉత్సాహంగా విధులలో చేరామో, అదే ఉత్సాహం చివరి వరకు కొనసాగిస్తూ.., తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టడానికి, మన వంతు కృషి చేయాలని అన్నారు. చివరగా, ఈ ప్రజాపాలన దినోత్సవం ప్రజల కోసం సేవాభావం, సమానత్వం, న్యాయం అనే విలువలను గుర్తు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డి.యస్.పి. సత్తయ్య గౌడ్, ఏఆర్ డిఎస్పీ నరేందర్, అడ్మినిస్ట్రేషన్ అధికారి ఇ.కళ్యాణి, యస్.బి. ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, డి.సి.ఆర్.బి. ఇన్స్పెక్టర్ బి.రమేష్, ఐ.టి. ఇన్స్పెక్టర్స్ నాగేశ్వర్ రావ్, ప్రవీణ్ రెడ్డి, సదా నాగరాజు, ఆర్.ఐ.లు రామరావ్, రాజశేఖర్ రెడ్డి, డానియోల్, యస్.బి., డి.సి.ఆర్.బి. యస్.ఐ.లు సూపరింటెండెంట్లు అశోక్, సిబ్బంది పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించిన ఎస్పీ పరితోష్ పంకజ్
Oplus_131072