రాత్రివేళ విధుల్లో పోలీసులకు టీ–నీళ్లు అందించిన ఎస్పీ రాజేష్ చంద్ర

రాత్రివేళ విధుల్లో పోలీసులకు టీ–నీళ్లు అందించిన ఎస్పీ రాజేష్ చంద్ర

చలికాల రాత్రుల్లో శ్రమిస్తున్న సిబ్బందిని వ్యక్తిగతంగా పరామర్శించిన జిల్లా బాస్ – మానవతా హృదయం కదిలించిన చర్య

కామారెడ్డి జిల్లా ప్రతినిధి  ప్రశ్న ఆయుధం నవంబర్ 16 

రాత్రి పూట క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి అండగా నిలిచి, మానవతా విలువలను చాటుకున్న కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ రాజేష్ చంద్ర ఐపీఎస్. చలికాలంలో రాత్రివేళ పహారా కాస్తున్న సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఆయన, నిన్న అర్థరాత్రి రెండు గంటలకు స్వయంగా టీ తయారుచేయించి సిబ్బందికి అందజేయడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది.

సుమారు 1500 మందికి పైగా సిబ్బందికి అధిపతిగా ఉన్న ఎస్పీ గారు, ఉన్నతాధికారిగా తన బాధ్యతలతోపాటు మానవతా దృక్పథాన్ని ప్రదర్శించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. సాధారణంగా రాత్రివేళ టీ, నీళ్లు వంటి ప్రాథమిక అవసరాలు కూడా అందక ఇబ్బందులు పడుతున్న సిబ్బందిని పరామర్శించిన ఆయన, సిరిసిల్ల రోడ్డు, రామారెడ్డి రోడ్డు, ఎల్లారెడ్డి రోడ్డు పరిధిలో విధుల్లో ఉన్న సిబ్బందికి స్వయంగా టీ, నీళ్ల బాటిళ్లను అందించారు.

తనిఖీ కోసం వచ్చిన ఎస్పీ గారి ఈ సానుభూతి గల చర్య చూసి సిబ్బంది ఆశ్చర్యానికి, భావోద్వేగానికి లోనయ్యారు. కేవలం ఆదేశాలు ఇచ్చే అధికారిగా కాకుండా, సిబ్బందితోపాటు ఉన్నతాధికారులు కూడా ఇలా మానవత్వంతో ముందుకు వస్తే ఎంతో ఆదరణగా ఉందని సిబ్బంది పేర్కొన్నారు.

ఈ ఘటన పోలీసు వర్గాలలో కొత్త ఉత్సాహాన్ని నింపగా, ప్రజల నుంచీ కూడా ఎస్పీ గారి చర్యకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి అధికారి తమకు బాస్‌గా ఉండటం పట్ల జిల్లా పోలీసు సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now