అంబేద్కర్ స్టడీ సర్కిల్ లో రాజ్యాంగ దినోత్సవంపాల్గొన్న ఎస్పీ రూపేష్

*అంబేద్కర్ స్టడీ సర్కిల్ లో రాజ్యాంగ దినోత్సవం*

*పాల్గొన్న ఎస్పీ రూపేష్*

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టడీ సర్కిల్ లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు పంబాల దుర్గాప్రసాద్ అధ్యక్షతన 75వ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రూపేష్ హాజరయ్యారు. ఎస్పీ చేతుల మీదుగా భారత రాజ్యాంగ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ.. ప్రజలకు రాజకీయంగా, ఆర్థికంగా అవకాశాల్లో కూడా సమభాగం కావాలని రాజ్యాంగాన్ని అందరూ చదవాలని సూచించారు. రాజ్యాంగం వల్లనే దేశం సుభిక్షంగా, ప్రశాంతంగా ప్రజలు ఉంటున్నారంటే దానికి మూలం అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే, ప్రజలు నిత్యం రాజ్యాంగాన్ని చదవాలని వాటిలో హక్కులను, అధికారాలను పొందాల్సిన బాధ్యత ప్రతి పౌరులు మీద ఉండాలని తెలిపారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడి అందరు జీవించాలని దేశ సమగ్రత, ఐక్యతను ప్రతి ఒక్కరూ చాటాలని అన్నారు. రాజ్యాంగ వజ్రోత్సవాలు నేటి నుంచి జనవరి 26 వరకు నియోజకవర్గం, మండలాల వారిగా, గ్రామ గ్రామాన ఈ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని, రాజ్యాంగం ఇంటింటా ఉండే విధంగా ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ పి.రామారావు, పోటీ పరీక్షల కన్వీనర్ కె.కృష్ణ కుమార్, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ మెంబర్ దుర్గాప్రసాద్, అంబేద్కర్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొండాపూర్ జగన్, పెద్దలు కోటయ్య, నాగయ్య, అనంతరామ్, విజయరావు, బక్కన్న, రాజు ,జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సునీత, మాజీ ఎంపీపీ అశోక్, ప్రధాన కార్యదర్శి సంచుల ప్రవీణ్, జోగ్యల్ల రాజు, మహిళలు, మేధావులు, కళాశాల విద్యార్థినులు, స్టడీ సర్కిల్ విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment