రాజంపేట్ పోలీస్ స్టేషన్‌పై ఎస్పీ అకస్మిక తనిఖీ
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 22
కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ సోమవారం రాజంపేట్ పోలీస్ స్టేషన్‌ను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మొదట రోల్కాల్ను పరిశీలించి హాజరైన, గైర్హాజరైన సిబ్బంది వివరాలను తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడుతూ మానవ వనరుల సమర్థ వినియోగం, రోల్‌కాల్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
ప్రతి కేసును నైపుణ్యం, నిజాయితీతో విచారించి ప్రజలకు న్యాయం చేయడం ప్రతి పోలీస్ బాధ్యత అని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, ఫిర్యాదులపై తక్షణ స్పందన ఇవ్వాలని సూచించారు. బ్లూకోల్ట్స్, పెట్రో కార్లు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద కదలికలపై వెంటనే స్పందించాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, విపిఒలు తరచుగా గ్రామాలను సందర్శించి సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.
డయల్ 100 ద్వారా వచ్చే ఫిర్యాదులపై వేగంగా, సమర్థవంతంగా స్పందించాలనీ, ప్రజల్లో విశ్వాసం కలిగించే విధంగా వ్యవహరించాలనీ ఎస్పీ స్పష్టమైన మార్గదర్శకత్వం ఇచ్చారు.
దసరా, దుర్గానవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని రాజంపేట్ పోలీసులకు సూచనలు తెలిపారు.