శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికై, బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు పోలీసు శాఖ పూర్తిస్థాయిలో కృషి చేస్తుందని, జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు అన్నారు.ప్రజావాణి నీ పురస్కరించుకొని సోమవారం నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 13 ఫిర్యాదులను జిల్లా ఎస్పీ స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడుతూ వారి సమస్యలను ఓపికగా విని పిర్యాదుల పరిష్కరానికి ఆయా పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడుతూ, పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని పరిష్కరించడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు ఇతరుల చేత ఎలాంటి వేధింపులకు గురైన వెంటనే డయల్ -100 లేదా పోలీస్ వారిని సంప్రదించాలని ఎస్పీ సూచించారు. 13 ఫిర్యాదుల వివరాలుభూ వివాదాలకు సంబంధించి -04 పిర్యాదులు.గొడవలకు సంబంధించి -01 పిర్యాదులు.ప్లాట్స్ కబ్జాకు సంభందించి -02 పిర్యాదులు.భార్య & భర్తల మధ్య గొడవకు సంబందించి -01పిర్యాదు.చిట్టి డబ్బులు ఇవ్వడం లేదనీ-01 పిర్యాదు.సైబర్ క్రైమ్ కు సంబంధించి -01 పిర్యాదు.ఇతర అంశాలకు సంబంధించి-03 పిర్యాదులు..
బాధితులకు సత్వర న్యాయం:ఎస్పీ టి . శ్రీనివాస రావు
by admin admin
Published On: August 12, 2024 6:57 pm
తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడ్డట్టయ్యింది