*ఇంటికే ఇసుక.. బుకింగ్కు ప్రత్యేక యాప్*
TG: రాష్ట్ర ప్రజలకు డోర్ డెలివరీ ద్వారా ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఓ ప్రత్యేక యాప్ తయారు చేయాలని సూచించారు. అవసరమైన వారు ఇసుక బుక్ చేసుకుంటే వెంటనే ఎంతకావాలంటే అంత సరఫరా చేసేలా ఉండాలని పేర్కొన్నారు.
నిర్మాణరంగ సంస్థలకు అవసరమైన ఇసుకనూ TGMDC ద్వారానే సప్లై చేయాలని చెప్పారు. వీటన్నింటి ద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు.